! ఇటీవల ఓ 65 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయిని మనువాడాడు. అయితే పెళ్లి ఇలా అయ్యిందో లేదో అల్లుడు అత్తకు ఓ శుభవార్తను అందించాడు. దీంతో అత్త ఎగిరి గంతేసింది. అసలేంటి ఈ స్టోరీ అంటే?
చింత చచ్చిన పులుపు చావదు అంటే ఇదేనేమో. ఓ 65 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఆ అమ్మాయి తరుఫు తల్లిదండ్రులు, బంధువులు అందరూ అంగీకరించారు. ఇక పెళ్లైన కొన్నాళ్లకే అత్తగారికి కొత్త అల్లుడు ఊహించని గుడ్ న్యూస్ ను అందించాడు. ఈ వార్తతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు సంతోషంతో మురిసిపోయారు. అసలు 65 ఏళ్ల వయసులో ఆయన ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు అతనెవరు? ఏంటా స్టోరీ అనే పూర్తి వివరాలు మీ కోసం.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు హిస్సామ్ హుసేన్ దేహైని (65). బ్రెజిల్ కు చెందిన ఇతను అరౌకారియా నగర మేయర్ గా కొనసాగుతున్నారు. గతంలో ఇతనికి 5 పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. బ్రెజిల్ చట్టాల ప్రకారం.. 16 ఏళ్లు దాటిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రుల అంగీకారంతో ఎవరినైనా పెళ్లి చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకున్న మేయర్ హిస్సామ్ హుసేన్ దేహైని.. ఇటీవల 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీనికి ఆ అమ్మాయి తల్లిదండ్రలు కూడా అంగీకారం తెలిపారు. ఇకపోతే ఆ అమ్మాయి తల్లి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి. తక్కువ జీతంతో పని చేస్తుంది.
ఈ విషయం తెలుసుకున్న అల్లుడు హిస్సామ్ హుసేన్ దేహైని.. పెళ్లైన మరుసటి రోజే అత్తను స్థానిక ప్రభుత్వంలో సాంస్కృతిక, పర్యటకశాఖ కార్యదర్శిగా నియమిస్తూ పదోన్నతి కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న అత్త ఎగిరి గంతేశారు. అయితే ఇదే విషయం డిప్యూటి మేయర్ దృష్టికి వెళ్లడంతో మండిపడి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా అక్కడి అధికారులు సైతం మేయర్ హిస్సామ్ హుసేన్ దేహైని తీరుపై చర్యలకు సిద్దమైనట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నానన్న ఆనందం మరువక ముందే ఇరుకున పడ్డ హిస్సామ్ హుసేన్ దేహైని తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.