ప్రేమ అనే రెండు అక్షరాల పదం మనిషిని ఎలానైనా ఆడిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రేమ అనేది ఎప్పుడు, ఎవరి మధ్య, ఎలా పుడుతుందో ఎవరం చెప్పలేము. అందుకే ప్రేమలో పడ్డవారు వయస్సు, ఆస్తులు, అంతస్తులు, కులం , గోత్రం, మతం వంటివి ఏమి పట్టించుకోరు. కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా మంది.. ఈ ప్రేమ గుడ్డిది రా బాబు.. అంటుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ ప్రేమ వివాహాం గురించి తెలిసిన వాళ్లు… ఈ ప్రేమ గుడ్డిది కాదు.. అంతకు మించి అని అంటున్నారు. మరి.. అంతలా అందరూ ఆశ్చర్యానికి గురైంది ఎందుకంటే.. 21 ఏళ్ల యువకుడు..52 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాను ఆమెను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నానని ఆ యువకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ వింత ప్రేమ పక్షుల పెళ్లి వేడుక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమాజంలో జరిగే కొన్ని ప్రేమ పెళ్లిలను చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని ప్రేమ జంటలను చూసినప్పుడు ప్రేమ ఇంత గుడ్డిదా?, దానికి రంగు, వాసన, రుచి..వంటివి ఏమి ఉండవా? అనే సందేహం కలుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ జంటను చూస్తే అదే చాలా మందికి అదే అనిపిస్తోందంట. 52 మహిళను 21 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఇదే ఆశ్యర్యంగా ఉండే.. ఆమెను ఎంతో గాఢగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడంట. అయితే వధువు తమ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు నిజమైన ప్రేమ దొరికిందని చెప్పింది. ఈ ఇద్దరు దాదాపు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మొదట్లో వీరిపెద్దలను అడిగేత ఒప్పుకోలేదంట. వారి అనుమతి కోసం ఎదురు చూస్తూ..మూడేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి ప్రేమను చూసి ఆశ్చర్యపోయిన పెద్దలు పెళ్లికి అనుమతించారు.
దీంతో ఆ మహిళతో యువకుడి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో..21 ఏళ్ల వరుడు 52 ఏళ్ల వధువుతో కలిసి ఫోటోలు దిగుతున్నాడు. కొత్త జంటని వీడియో తీస్తున్న ఓ వ్యక్తి .. మీ ఇద్దరికీ పెళ్లి అయ్యిందా? అని యువకుడిని అడిగాడు. దీంతో వరుడు అవును అని సమాధానం చెప్పాడు. అంతేకాక తనకు స్వచ్ఛమైన ప్రేమ దొరికిందని, ప్రేమకు వయస్సుతో సంబంధంలేదని ఆ వరుడు అన్నాడు. ఈ ప్రత్యేకమైన ప్రేమకథ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ జంట వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది. చరిత్రలో నిలిచిపోయే ప్రేమజంట మీదే.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరీ.. 52 వెడ్స్ 21 జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.