35 ఏళ్ల వ్యక్తిని 18 ఏళ్ల అమ్మాయి అంకుల్ అని పిలిచింది.. అలా పిలవడమే పాపమైపోయింది. అంకుల్ అని పిలిచి ప్రాణాల మీదకు తెచ్చుకుందా అమ్మాయి. తనను అంకుల్ అని పిలుస్తావా అంటూ ఆ అమ్మాయిని చితకబాదేశాడు ఆ వ్యక్తి. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. మాట వరుసకు అంకుల్ అని పిలిచిన అమ్మాయిని విచక్షణారహితంగా కొట్టి ఆస్పత్రి పాలు చేశాడు.
ప్రస్తుతం ఆ అమ్మాయి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన గురించి వచ్చిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.