ఈ ప్రపంచంలో నిత్యం అనేక వింతలు చోటు చేసుకుంటుంటాయి. అలా మూగజీవాల విషయంలోను కొన్ని వింత ఘటనలు జరగడం తెలిసిందే. రెండు తల ఆవుదూడ పుట్టడం, మేక ఐదు కాళ్లతో పుట్టడం.. ఇలా అనేక విచిత్రమైన సంఘటనలు మనం నిత్యం చూస్తుంటాము. అలానే తాజాగా ఓ 11 నెలల ఆవుదూడ పాలు ఇస్తుంది. ఒక్కసారి కూడా గర్భం దాల్చలేదు. అయినా రోజూకు లీటర్ల కొద్ది పాలిస్తోంది. ఈ వింత ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కేరళలోని కన్నూర్ జిల్లాలోని కంగోల్ కు చెందిన సంజేశ్ అనే వ్యక్తి 2021 జులైలో ఓ ఆవును, దూడను కొనుగోలు చేశాడు. ఆవు పొదుగుకు ఇన్ఫెక్షన్ సోకగా.. దాన్ని అమ్మేశాడు. దూడను మాత్రం తానే పెంచుకుంటున్నాడు. దానికి నిత్యం పుష్టికరమైన ఆహారం అందిస్తూ పోషిస్తున్నాడు. ఈ ప్రస్తుతం ఆ దూడ వయస్సు 11 నెలలు. అయితే కొద్ది రోజుల క్రితం నుంచి దూడ పొదుగు ఉబ్బి ఉండడాన్ని పొరుగింటి మహిళ గమనించింది. ఈ విషయాన్ని సంజేశ్ కు చెప్పింది. దూడ వద్దకు వెళ్లి పరిశీలించి చూడగా.. పొదుగు ఉబ్బినట్లు సంజేశ్ కూడా గుర్తించాడు. పొదుగులు పాలు ఉండొచ్చు అనే అనుమానంతో పితికాగా.. పల్చటి పాలు వచ్చాయి. దూడకు మంచి మేత వేస్తూ కొన్ని రోజుల తర్వాత మరొకసారి పాలు పితికి చూడగా.. పాలు ధారగా వచ్చాయి. పాలు కూడా బాగానే ఉన్నాయి.
ఇదీ చదవండి: జొన్న చేను కోస్తుండగా చిరుత హల్ చల్.. వీడియో వైరల్
ఈ క్రమంలో ప్రతి రోజు రెండు పూటల పాలను పిండసాగాడు. పాలు చిక్కగా, తాగడానికి కూడా బాగున్నాయి. మాములు, ఆవులు, గేదెలు ఇచ్చేపాల మాదిరిగానే ఉన్నాయి. దీంతో సంజేశ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. అలా నిత్యం ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ఆ ఆవుదూడ మూడున్నర లీటర్ల పాలు ఇస్తోంది. దీంతో చుట్టుపక్కల వారు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక్కసారి కూడా గర్భం దాల్చని దూడ పాలివ్వడం పెద్ద వింతగా మారింది. దూడ ఇస్తున్న పాలను పరీక్షించగా అందులో 8.8 శాతం వరకు కొవ్వు ఉన్నట్లు వెల్లడైంది. జన్యుపరమైన మార్పులతో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని స్థానిక వైద్యులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.