గేదె మృతి చెందడంతో దాదాపుగా 1000 జనాలు ఆసుపత్రికి పరుగులు తీశారు. వినటానికి ఆశ్చర్యంగా ఇది ముమ్మాటికి నిజం. సానుభూతితో చనిపోయిన గేదెను చూడటానికి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు గేదే చనిపోతే ఆసుపత్రికి వెళ్లడం ఏంటని అనుకుంటున్నారా? అసలు సంగతి ఏంటంటే? అది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రాంతంలోని ఓ గ్రామం. ఇటీవల అదే గ్రామంలో ఓ వేడుక జరిగింది. ఆ వేడుకకు గేదె పాలతో తయారు చేసిన తియ్యటి పదార్థాలను వచ్చిన 1000 మందికి పంచి పెట్టారు.
ఇది కూడా చదవండి: వారెవ్వా.. నెత్తిమీద గడ్డిమోపుతో సైకిల్ పై దూసుకెళ్లిన కుర్రాడు.. వీడియో వైరల్
ఇక మరుసటి రోజే అదే గేదె పిచ్చి కుక్క కాటుకు గురై మరణించిందని తెలిసింది. ఈ వార్త తెలిసిన గ్రామంలోని ప్రజలు, వేడుకకు వచ్చిన ప్రతీ ఒక్కరు రేబిస్ అనే వ్యాది వస్తున్న భయంతో ఆసుపత్రికి పరుగులు తీసి టెస్ట్ చేయించుకున్నారు. ఇంత మంది ఒకేసారి రేబిస్ టెస్ట్ కోసం రావడం ఏంటని ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారట. ఇటీవల మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.