సాధారణంగా మనుషులు చనిపోయాక వారి ఆత్మలు మన చుట్టూనే తిరుగుతుంటాయి. అలాంటి ఆత్మలకు సరైన శాంతి చేయిస్తే అవి పూర్తిగా కనుమరుగై పోతాయని పెద్దవాళ్లు అంటుంటారు. కానీ చనిపోయిన ఆత్మలు ఉండటం ఏంటి..? వాటికి శాంతి ఏంటని అందరూవిడ్డురంగా చూస్తుంటారు. కానీ చనిపోయిన వారి తీవ్రమైన కోరికలు.. వారు అమితంగా ఇష్టపడే వస్తువుల పై ప్రభావం చూపుతాయని, వాటికి రుజువులు కూడా ఉన్నాయని అంటున్నారు డాక్టర్ అనంత లక్ష్మి.‘చనిపోయిన వారి వస్తువులు.. అంటే వారి పెన్ను గానీ, కర్చీఫ్ గానీ లేదా వాళ్లెప్పుడూ రెగ్యులర్ గా వాడేవి కొద్ది రోజులపాటు కదులుతూ ఉంటాయి. అదేంటి అలా కదిలాయి.. చిత్త భ్రమ అంటే కాదు. జీవం విడిచినవారు మళ్లీ వారి వస్తువులను తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ భౌతికంగా ఉండరు కాబట్టి సాధ్యం కాదు. కానీ వారి తీవ్రమైన భావాలు వస్తువులను కదిలిస్తాయి’ అంటూ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు డాక్టర్ అనంత లక్ష్మి. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.