ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు అంటుంటారు. అది నిజమో కాదో గాని.. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కళ్లారా చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ప్రస్తుతం తనను పోలిన మనిషిని చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అత్యధిక ధనవంతుడైన ఎలన్ మస్క్ కి తప్పేలా లేదు. అవును.. టెస్లా కంపెనీ సీఈవోగా, ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ ని పోలిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
REPORT: Elon Musk doppelganger discovered in China.pic.twitter.com/tivuhbS97w
— New Granada (@NewGranada1979) December 5, 2021
చైనీస్ టిక్ టాక్ యాప్ నుండి వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో.. అచ్చు గుద్దినట్లుగా సూట్ ధరించి, ఎలన్ మస్క్ లానే హావభావాలు పలికించడం విశేషం. అందులోను ఆ వ్యక్తి స్మైల్ కూడా ఎలన్ మస్క్ నే తలపిస్తుందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. మరి ఆ వీడియోలో వ్యక్తి నిజమేనా లేక ఫేక్ క్రియేట్ చేసారా..? అనేది తెలియలేదు. అదీగాక నిజమైతే ఆ వ్యక్తి ఎవరనే విషయాలు బయటికి రావాల్సి ఉంది. ట్విట్టర్ లో ఈ వీడియోతో పాటు టెస్లా ఎలన్ మస్క్ ని సైతం ట్యాగ్ చేస్తున్నారు. మరి ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా వీడియో పై ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.