బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయగా శనివారం ఆమె విచారణకు హాజరయ్యారు. అయితే లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడం, ఆమెను ఈడీ విచారణ చేయడం వంటి ఘటనలతో ప్రతి పక్షపార్టీలు తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీపై , కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా అడిగిన ఓ ప్రశ్ననకు.. కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళా కమిషన్ డీజీపీని విచారణకు ఆదేశించింది. అలానే బండి సంజయ్ ను వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కమిషన్ తెలిపింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో ఆయనకు మహిళా కమిషన్ నోటిసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తారా? అని మీడియా వాళ్లు అడగ్గా.. తప్పు చేస్తే.. అరెస్ట్ చేయక ముద్దు పెట్టుకుంటారా? అంటూ బండి సంజయ్ అన్నారు. అలానే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఓ వికెట్ క్లీన్ బౌల్డని కూడా అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు తెలంగాణ, అటు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ విచారణ చేయాలని అదేశించింది. విచారణ అనంతరం ఆ నివేదికను మహిళా కమిషన్ కు సమర్పిస్తారు. ఇదే సమయంలో బండి సంజయ్ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మరి.. బండి సంజయ్ విషయంలో మహిళా కమిషన్ స్పందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.