భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. మూడువారల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. తన కాలికి గాయమైన విషయాన్ని కవితే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. మూడువారల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. తన కాలికి గాయమైన విషయాన్ని కవితే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాలికి ఫ్రాక్చర్ కావడం వల్ల మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారని ఆమె తెలిపారు. అందుకే కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమతం కానున్నట్లు కవిత తెలిపారు. అయితే ఏదైన సమస్య గురించి వచ్చే వారికి తన ఆఫీస్ మాత్రం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.
అలానే ఎలాంటి సమాచారానికైనా, సాయానికైనా తన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని కవిత అన్నారు. ఆమె ఎలా గాయపడ్డారు అనే విషయం మాత్రం తెలియరాలేదు. అలానే తన కాలికి గాయమైన విషయం వెల్లడించిన కవిత.. ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే కవిత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఎదుట ఆమె విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మొత్తంగా మూడు రోజుల పాటు ఆమెపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అదే సమయంలో అధికారులపై కవిత అనేక ఆరోపణలు చేశారు.
అలానే తన వద్ద ఉన్న ఫోన్లను కూడా కవిత అధికారులకు అప్పగించారు. తాను ఏ తప్పు చేయలేదని, అవసరమైతే న్యాయపరంగా పోరాడేందుకు కూడా సిద్దమని ఆమె ప్రకటించారు. ఇలా ఈడీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే మహిళా రిజర్వేషన్ విషయంలో ఆమె ఢిల్లీలో ధర్న చేపట్టారు. ఇలా ఈ మధ్యకాలంలో కవిత వార్తలో నిలిచారు. అలానే ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్ట్ అవుతారని ఊహగానాలు కూడా వెల్లువడ్డాయి. కవితకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు కూడా చెేపట్టారు. తాజాగా ఆమె కాలికి గాయం కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023