మనీ లాండరింగ్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న మాయగాడు సుఖేష్ చంద్ర శేఖర్ మరో బాంబు పేల్చాడు. బీఆర్ఎస్, ఆప్ నేతలతో చేసిన మేసేజ్ చాట్స్ ను బయటపెట్టాడు. అందులో కోడ్ లాంగ్వేజ్ తో మాటలతో పాటు కొన్ని తెలుగు పదాలున్నాయి.
మనీ లాండరింగ్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న మాయగాడు సుఖేష్ చంద్ర శేఖర్ గతంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఆదేశాలపై హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఇటీవల ఆరోపణలు చేశాడు. అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుఖేశ్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నాడు. ఆప్ నేతలపై సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం కేజ్రీవాల్‌కు వందల కోట్ల ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ప్రేమ లేఖ రాస్తూ కాలక్షేపం చేస్తున్న ఇతగాడు ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చాడు.
బీఆర్ఎస్, ఆప్ నేతలతో చాటింగ్ చేసిన మేసేజ్‌లను బయటపెట్టాడు. అందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో జరిగిన చాటింగ్ వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సుఖేష్ తరుపు లాయర్ బయటపెట్టారు. అందులో కోడ్ లాంగ్వేజ్‌తో పాటు కొన్ని తెలుగు పదాలున్నాయి. కవితను పలుమార్లు అక్క అంటూ పదేపదే సంబోధించాడు. డబ్బులు డెలివరీ చేసినట్లు కవితకు చేసిన చాట్స్‌లో ఉండటం గమనార్హం. స్పోకెన్ టు మనీష్ అని రిప్లైలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్, సుఖేష్ జైన్‌కు ఇన్ఫామ్ చేయాలని సుఖేష్ కోరాడు. వీరి పేర్లు పూర్తిగా కాకుండా ఏకే, ఎస్‌జేగా సంబోధించాడు. సత్యేంద్ర జైన్‌తోనూ చాట్ చేసిన స్క్రీన్ షాట్లను వెలుగులోకి వచ్చాయి. అందులో 15 కేజీల నెయ్యి రెడీ అంటూ మేసేజ్ చేసిన సుఖేష్. హైదరాబాద్ లో సిస్టర్‌కు పంపాలని సుఖేష్‌కు రిప్లై అందింది.
Big update on Delhi liquor scam:#SukeshChandrashekhar released the screenshots of chat with daughter of cm #KCR & MLC #kalvakuntlakavitha 👇 https://t.co/g66Cxk5wlK pic.twitter.com/US66fPpRyf
— Tharun Reddy (@KethireddyTarun) April 12, 2023