నల్లమల అడవిలో 25 ఏళ్ల యువతి అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. అందునా.. కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్న యువతి ఆ తర్వాత కాసేపటికే కనపడకుండా పోయింది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.
మహిళలు అదృశ్యమవ్వడం అన్నది ఎప్పటిలానే ఒక వార్తయినా ఈమె అడవిలో తప్పిపోవడమన్నది ఈ కథనంలో ట్విస్ట్. అందులోనూ ఈ యువతి అదృశ్యమైనది మామూలు అడవి కాదు.. ‘నల్లమల పారెస్ట్’. దక్షిణాది అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య దర్శనానికి వచ్చిన యువతి ఉన్నట్టుండి అడవిలో కనపడకుండా పోయింది. ఆ వివరాలు..
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతర అందరికీ తెలిసే ఉంటుంది. చుట్టూ ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించు కోవడం జనాలు పోటెత్తుతారు. రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కి.మీ. మేర నడక మార్గాన వెళ్లి స్వామిని దర్శించు కుంటారు. అలా లింగమయ్య స్వామి వారి దర్శనం కోసం కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్ కు చెందిన గాయత్రి(25) హాజరైంది. ఈ నెల 6న నల్లమల అడవిలో ఈ జాతర జరగగా.. కుటుంబసభ్యులతో కలిసి గాయత్రి కూడా స్వామి వారిని దర్శించుకుంది. ఆ తర్వాత కాసేపటికే కనపడకుండా పోయింది.
చుట్టుపక్కల వెతికినా ఎలాంటి పైత్యం లేకపోవడం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జాతరకు వచ్చిన యువతి తప్పిపోవడం అన్నది అందరిని విస్మయానికి గురిచేస్తోంది. ఆమె ఎటైనా వెళ్లిపోయిందా..? లేదా ఎవరైనా కిడ్నప్ చేశారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.