గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార పక్షం.. ప్రతి పక్ష నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ మద్య ఏపి అసెంబ్లీలో జరిగిన రగడ మరింత వేడిడిని రాజేసింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నుంచి రాజుకున్న వేడి మొన్నటి అసెంబ్లీలో చంద్రబాబు చేసిన శపథం వరకు ఒకలా సాగింది. అనంతరం చంద్రబాబు ప్రెస్ మీట్ లో కన్నీటీతో భావోద్వేగంగా మాట్లాడటంతో. రాజకీయ రచ్చ మరింత వేడేక్కింది.
ఈ రాజకీయ యుద్ధం ప్రక్కన ఉన్న పక్క రాష్ట్రానికి పాకింది. తాజాగా మధిర కౌన్సిలర్ మల్లాది వాసు సంచలన కామెంట్స్ చేశాడు. కమ్మ సంఘం వన సమారాధనలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. కమ్మ పెద్దలందరూ ఓ ప్రణాళిక చేపట్టాలంటూ సూచిస్తున్న వాసు చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి.
నాని, వంశీతో పాటు అంబటి రాంబాబు వంటి వాళ్లను భౌతికంగా దూరం చెయ్యాలి.. అందుకోసం 50 లక్షలు ఆర్థిక సాయం చేస్తానంటూ రెచ్చిపోయిన వాసు మాట్లాడిన వీడియో తెగ వైరల్ అవుతుంది. మల్లాది వాసు మాట్లాడిన వాటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.