తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహానటుడు.. నటసార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.
తెలుగు ప్రజల అభిమాన హీరో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి రజినీకాంత్ తనదైన స్టైల్లో మాట్లాడాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్.. విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు గరం అవుతున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని.. సూపర్ స్టార్ రజినీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్.. బుద్దీ జ్ఞానం లేకుండా చంద్రబాబుని పొగుడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చంద్రబాబు కుటిల నీతి గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించాలని.. ఆయనను బ్లాక్ మేయిల్ చేసేందుకే రజినీకాంత్ ని రంగంలోకి దింపారని అన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచి తన చుట్టూ ఏం జరుగుతుందో చూడాలని.. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలని కొడాలి నాని హితవు పలికారు.
వెధవలంతా ఒకచోట చేరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఏదో ఘనంగా జరుపుతున్నాం అంటూ టాం టాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ గురించి తెగ పొగుడుతున్న రజినీకాంత్ ఆయనకు ఏం చేశాడు..? ఎన్టీఆర్ బతికి ఉండగా ఒక్కసారైనా ఆయన గురించి పట్టించుకున్నాడా? ఇప్పుడు ఆయన గురించి తెగపొగిడేస్తున్నారని విచుచుకుపడ్డారు. వైస్రాయ్ హూటల్లో ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన చంద్రబాబు కి మద్దతు తెలిపి.. ఇప్పుడు ఎన్టీఆర్ ఎంతో గొప్పతనం గురించి పొగడటం సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల షూటింగ్ చేస్తే.. మూడు రోజులు హాస్పిట్ లో పడుకునే రజినీకాంత్.. తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు.. ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ మరింత దిగజారిపోతున్నారు అంటూ మండిపడ్డారు. రజినీపై కొడాలి నాని చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.