మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్రంగా అనారోగం పాలయ్యారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారని ప్రముఖ మీడియా కథనం రాసుకొచ్చింది. ఆయన అనారోగ్యానికి కారణం క్యాన్సర్ అని, ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. ఆయన తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నారని, కొడాలి నాని తర్వాత ఆయన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నారని సదరు మీడియా రాసుకొచ్చింది. అయితే గతంలో కూడా కొడాలి నాని ఆరోగ్యంపై అనేక ప్రచారాలు జరిగాయి. మెరుగైన ఆరోగ్యం కోసం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అప్పట్లో నాని లేజర్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నారని ప్రచారం జరిగింది. గత ఏడాది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారని, అపోలో ఆస్పత్రిలో చేర్పించి అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారని.. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, లేజర్ చికిత్సతో రాళ్లను కరిగించుకునే ట్రీట్‌మెంట్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఆయనకు క్యాన్సర్ అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రముఖ మీడియా కథనం రాయడంతో కొడాలి నాని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.