హైదరాబాద్ నగరంలో అద్భుత కట్టడాలకు నెలవుగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని అన్ని విధాలా నభూతో నభిష్యతి అన్న విధంగా తీర్చి దిద్దుతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ట్విన్ టవర్స్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సంబంధించిన ట్విన్ టవర్సే. వాటి తర్వాత ప్రపంచంలో చాలా చోట్ల ట్విన్ టవర్స్ పుట్టుకొచ్చినా.. అమెరికాలోని ట్విన్ టవర్సే ఫేమస్ అయ్యాయి. ఇందుకు వేరే కారణం ఉందనుకోండి. ఆ విషయం పక్కన పెడితే.. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో నగరంలో ట్విన్ టవర్స్ కట్టే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొత్త సచివాలయానికి దగ్గరలోనే భారీ ట్విన్ టవర్స్ నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల హెచ్‌ఓడీలు ఒకే చోట ఉండే విధంగా ఈ టవర్ల నిర్మాణం జరగనుందని సమాచారం.
సెక్రటేరియట్‌లోని మంత్రులు, కార్యదర్శులకు తరచుగా హెచ్‌ఓడీలతో పని ఉంటోదని, వారంతా ఒకే చోట ఉంటే పనులు త్వరగా అవుతాయని కేసీఆర్ భావిస్తున్నారట. ట్విన్ టవర్ల నిర్మాణం కోసం ప్రభుత్వ అధికారులు స్థలాన్ని వెతుకుతున్నారట. వీలైనంత త్వరగా ఈ ట్విన్ టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. కాగా, తెలంగాణ ప్రభుత్వం తమను ఆదాయం విషయంలో అన్ని విధాలా ఆదుకుంటున్న హైదరాబాద్‌పై ప్రత్కేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టే పనిలో పడింది. మరి, త్వరలో హైదరాబాద్ నగరంలో నిర్మాణం కానున్న ట్విన్ టవర్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.