హైదరాబాద్ లో మోటర్ వెహికల్ యాక్ట్ ను పోలీసులు స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. అనవసరమైనా స్టిక్కర్లు, అద్దాలకు బ్లాక్ కవర్ లను తొలగించే కార్యక్రమం చేపట్టారు పోలీసులు. ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రెటీలు తమ కార్లకు బ్లాక్ ఫిలింలు వాడుతున్నారు.. అలా వాడకూడదని పోలీసులు చెప్పిన్పటికీ కొంత మంది అలాగే మెయింటేన్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే సోదాల్లో చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు పట్టుబడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పలువురు సెలబ్రెటీల కార్లను ఆపి వారి కార్లకి ఉన్న బ్లాక్ ఫిలింలని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు.
ఇటీవల టాలీవుడ్ కి చెందిన నటులు, దర్శక, నిర్మాతలకు సంబంధించిన కార్ల బ్లాక్ ఫిలింలు పోలీసులు తొలగించారు. తాజాగా హీరో ప్రభాస్ కారుకు బ్లాక్ ఫిలిం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.. వెంటనే వాటిని తొలగించి ఆయనకు ఛలానా విధించారు. హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు కార్లను ఆపి చెక్ చేస్తున్నారు. అదే సమయంలో నంబర్‌ప్లేట్ సరిగ్గా లేకపోవడం గమనించి కారు ఎవదీ అని విచారించగా హీరో ప్రభాస్ ది అని తేలింది.
అంతేకాదు ఎంపీ స్టిక్కర్ ఉండటం గమనించారు. వెంటనే ఆ స్టిక్కర్ తొలగించిన పోలీసులు 1,450 రూపాయలు జరిమానా విధించారు. జరిమానా విధించిన సమయంలో ప్రభాస్ కారులో లేరు. వాహనాలకు ఉన్న బ్లాక్ స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. అలా తొలగించని వారి వాహనాలకు ఫైన్స్ కూడా వేస్తున్నారు.