సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరిచేందుకు అధికారులతో బిజీ బిజీగా గడుపుతుంటారు. సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తుంటారు. అంతేకాక తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం భిన్నంగా ఉంటారు. వారు ప్రజలకు సేవ చేస్తూనే.. వ్యవసాయం, ఇతర పనులు కూడా చేస్తుంటారు. పొలం వేసి పంటలు సైతం పండిస్తుంటారు. ఇప్పటికే ఇలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే, మంత్రులు, మాజీ మంత్రులు అనేక మంది ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాగలి పట్టి.. రైతుగా మారారు. తన స్వగ్రామమైన పర్వతగిరిలో నాగలి పట్టి పొలం దున్నారు. పొలంలో పనులు చేస్తున్న మంత్రిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి సార్ చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎర్రబెల్లి దయాకర్ రావు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెరాస పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్ర శాఖమంత్రిగా విధుల్లో బిజీబిజీగా ఉన్న ఎర్రబెల్లి.. తరచు తన స్వగ్రామామైన పర్వతగిరికి వెళ్లి వస్తుంటారు. అలానే ఇటీవల వరంగల్ జిల్లాలోని పర్వతగిరి వెళ్లారు. అక్కడ తన సొంత పొలంలో జరుగుతున్న వ్యవసాయ పనులను పరిశీలించారు. అంతేకాక వెంటనే పొలంలోకి దిగిన మంత్రి.. నాగలి చేతబట్టిన పొలం దున్నారు. కూలీలతో కలిసి వారి జానపద పాటలకు గొంతు కలిపి.. వారితో పాటు నాట్లు వేశారు. వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేస్తే.. ఆయన మంత్రులు ఆ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నారు.
వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మంత్రులు పొలాల్లోకి దిగి నాగలి పడుతున్నారు. తమ నాయకుడి ఆశయ సాధనలో అడుగులు వేస్తామని కేవలం మాటల రూపంలోనే కాకుండా చేతలుగా చేసి చూపిస్తున్నారు. రైతు రాజు.. రాజు కూడా రైతు అనే దానిని తమ ప్రభుత్వం రుజువు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గతంలో మంత్రి జగదీష్ రెడ్డి కూడా నాగలి పట్టి పొలంలోకి దిగారు. తాజాగా మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఆయన నాగలి పట్టి పొలం దున్ని.. వరినాట్లు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇలా మంత్రులు పొలంబాట పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తన సొంత పొలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కూలీలతో కలిసి నారు తీశారు.. అనంతరం గొర్రు దున్ని.. రైతుల దృష్టిని ఆకర్షించారు.. pic.twitter.com/RvL6XYzw9b
— Namasthe Telangana (@ntdailyonline) December 27, 2022