గత కొన్ని రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ పర్యటన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి. రాహూల్ గాంధీ ఈ నెల 6, 7న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. కానీ ఈ సభకు అధికారులు నో అని చెప్పకనే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ రావాల్సిన అవసరం లేదని టీఎర్ఎస్ నేతలు బహిరంగంగానే అంటున్నారు.. దీనిపై కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ల మద్య పెద్ద రగడ మొదలైంది. ఒక ఎంపీ, జాతీయ స్థాయి నాయకుడు రాహూల్ గాంధి చారిత్రాత్మక యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో మాట్లాడితే ఏంటీ తప్పని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. వీసీ తోపాటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ కాస్త విజ్ఞత తో ఆలోచించాలని కోరుతున్నారు.
ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే యూనివర్సిటీ పర్యటనకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషాలు వెల్లువెత్తాయి. అంతేకాదు రాహూల్ గాంధీ ముఖాముఖికి హైకోర్టు ధర్మాసనం అనుమతిచ్చింది. రాహుల్ యూనివర్సిటీలో 150 మంది మాత్రమే పాల్గొనాలని వీసికి కోర్టు స్పష్టం చేసింది.ఓయూలో విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారని అన్నారు.