తెలంగాణ గవర్నర్‌కి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలాలేదు. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధి అంటే ఫామ్ హౌస్‌లు కట్టడం కాదు అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు వేసింది గవర్నర్. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో.. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది. తమిళిసై తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ కావడం […]
ఇంటర్, బీటెక్ పూర్తి చేసి.. సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుణ్ణు అని భావిస్తున్నారా? అయితే మీ కోసం ఈ అవకాశం. చదువు పూర్తి చేసి ఉద్యోగాలు లేక ఏదో ఒకటి సాధించాలన్న కసితో ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. తెలంగాణ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ […]
ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమాల కేసులో సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసుకు సంబంధించి ఇవాళ ఆమెకు విముక్తి లభించింది. ఆమె కేసుని కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ […]
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి విచారణ ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసు పెట్టడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య ఉషా బాయి సింగ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె. శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజాసింగ్ తరపు లాయర్ రామచంద్రరావు, ప్రభుత్వ […]
వైసీసీ రెబెల్ లీడర్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ని హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. సీఎం జగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయడానికి సరైన కారణాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల జగన్ బెయిల్‌ను రద్దు చేయలేమంటూ ఉత్తర్వులు ఇస్తూ.. రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు జగన్ షరతులను ఉల్లంఘించిన సంఘటక ఒక్కటి […]
తెలంగాణ హైకోర్టులో హీరో వెంకటేష్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. వారి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. దాంతో ఏళ్లుగా సాగుతున్న భూ వివాదానికి ముగింపు లభించింది. ఆ వివరాలు.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన వివాదంలో తాజాగా తెలంగాణ హైకోర్టు రామానాయుడి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ భూములు రామానాయుడి కుటుంబానికి చెందనవిగా తేల్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టి వేసింది. […]
గతంతో పోలిస్తే ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు వేలల్లో ధర పలకడం కూడా కష్టంగా ఉన్న స్థలాలకు ప్రస్తుతం కోట్లలో ధర లభిస్తుంది. దాంతో గతంలో తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న వాళ్లు.. ప్రస్తుతం బాధపడుతున్నారు. మరి కొందరు మాత్రం అమ్మిన భూమలును తిరిగి తీసుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన భూమా కుటుంబంలో చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. […]
సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. విరాటపర్వం మూవీ ప్రమోషన్ల సందర్భంగా ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో పాటుగా.. గోరక్షకులపై సాయి పల్లవి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భజరంగ్‌దళ్ నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. న్యాయ సలహాతో కేసు నమోదు చేసిన పోలీసులు సాయిపల్లవికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వాటిని రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. […]
తెలంగాణ సీఎం కేసీఆర్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా కలెక్టర్, పలువురు అధికారులకు సైతం న్యాయస్థానం నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ విషయం రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు అధికార పార్టీ టీఆర్ఎస్ కి సంబంధించిన కార్యాలయాలకు గాను భూమిని కేటాయించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో టీఆర్ఎస్ కార్యాలయానికి బంజారాహిల్స్‌లో ఏకంగా 4,935 గజాలు కేటాయించడం అప్పట్లో పెద్ద […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ పర్యటన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి. రాహూల్ గాంధీ ఈ నెల 6, 7న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. కానీ ఈ సభకు అధికారులు నో అని చెప్పకనే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు […]