సినీ ఇండస్ట్రీలో తన కాంట్రవర్సీ కామెంట్స్, ట్విట్స్ తో ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు దర్శకులు రాంగోపాల్ వర్మ. ట్రెండ్ కి తగ్గట్టు ఆయన ట్విట్స్ ఉంటాయి. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రెటీలపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఆయన ఎవరిని ఎప్పుడు పొగుడుతాడో.. తిడతారో తెలియదు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటుంటారు. రామ్ గోపాల్ వర్మ ..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ఇటీవల ఒక సందర్భంలో తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఫోటో తీయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘విత్ రియల్ టైగర్ ఆఫ్ తెలంగాణ’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా మురళీధర్ పై బయోపిక్ ‘కొండా’ తీస్తున్న సంగతి తెలిసిందే.
ఆ మద్య తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ ను కలవడం చర్చనీయాంశమవుతున్నది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఫొటోలో వర్మ అప్యాయంగా రేవంత్ రెడ్డి భుజంపై వేయడం చూసి నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.