హైదరాబాద్ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై స్పందించారు ప్రధాని మోదీ. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక మరణించిన 11 మంది కుటుంబాలకు పిఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున అందిస్తామని ప్రధాని ట్విట్టర్ లో తెలిపారు.
ఇది కూడ చదవండి: సికింద్రాబాద్ లో ఘోరం.. భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం!
ఈ ఘటనలో ఇంతమంది మరణించడం చాలా బాధకరమన్నారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయట పడగా మిగిలిన 13 మంది మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతి అయ్యారు. వీరిలో అక్కడికక్కడే 11 మంది సజీవ దహనమయ్యారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
Pained by the loss of lives due to a tragic fire in Bhoiguda, Hyderabad. My thoughts are with the bereaved families in this hour of grief. An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2022