టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఘెర పరాభవం తర్వాత.. ఇంటా బయట సర్వత్రా విమర్శల వర్షం కురిసింది. ఇక పాక్ మాజీ క్రికెటర్లు ఎప్పుడెప్పుడు టీమిండియాను విమర్శిద్దామా అని ఎదురు చూస్తున్న క్రమంలో.. టీమిండియా ఘోర ఓటమి వారికి ఓ అద్భుత అవకాశంగా దొరికింది. దాంతో అక్తర్ తన అక్కసును వెల్లగక్కగా.. పాక్ ప్రధాని సైతం టీమిండియాపై ఉన్న ద్వేశాన్ని బయటపెట్టాడు. ట్వీటర్ వేదికగా ” అయితే ఈ ఆదివారం ఫైనల్లో 152/0, 170/0 జట్లు తలపడబోతున్నాయి” అంటూ రాసుకొచ్చాడు. దాంతో భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే పాక్ ప్రధానికి టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కౌంటర్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం పఠాన్ రిప్లై నెట్టింట వైరల్ గా మారింది.
క్రీడాలోకంలో గెలుపోటములు అనేవి సహజం. గెలిచినా.. ఓడినా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తుంటారు కొంత మంది ఆటగాళ్లు. ఇక మరికొందరేమో ఆటగాళ్లను రెచ్చగొడుతూ దూషణలకు, ట్వీటర్ వేదికగా విమర్శలకు దిగుతుంటారు. టీమిండియా సెమీస్ లో ఓడిపోవడంతో ఏకంగా పాక్ ప్రధానే విమర్శలకు దిగాడు. భారత జట్టును విమర్శిస్తూ..” ఈ ఆదివారం ఫైనల్లో 150/0, 170/0 జట్లు తలపడబోతున్నాయి అన్నమాట” అంటూ టీమిండియాపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఈ విమర్శలకు దీటుగా బదులిచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.
Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai.
— Irfan Pathan (@IrfanPathan) November 12, 2022
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ..” మీకు మాకు ఉన్న తేడా ఇదే. మేం గెలిచినప్పుడు మా ఆనందంతో మేం సంతోషంగా ఉంటాం. కానీ మీరు సమస్యలతో సతమతమవుతూ.. ఉన్నప్పటికీ ఇతరు ఒటమిని మీ సంతోషంగా అనుకుని జీవిస్తున్నారు. ముందు మీరు మీ దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించుకోండి. ముందు మీ కష్టాలను మీరు తీర్చుకోండి” అంటూ ఎపిక్ రిప్లై ఇచ్చాడు. దాంతో నెటిజన్లు పఠాన్ రిప్లైకు స్పందిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇతరుల ఓటమి మన గెలుపు ఎన్నడూ కాదన్న విషయం గుర్తించుకోవాలని ఈ సందర్బంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Irfan Pathan replies back the Pakistan’s PM 🔥🔥#cricket #india #pakistan #t20worldcup pic.twitter.com/jY7mSWsZpR
— Sportskeeda (@Sportskeeda) November 12, 2022