డబ్బు అంటే ఎవరికి చేదు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది కరెన్సీ అంటారు. అలాంటి డబ్బు రోడ్డుపై దొరికితే వెనుకా.. ముందు ఏదీ ఆలోచించకుండా ఎగబడి తీసుకుంటాం. ఆ మద్య శ్రీకాకుళంలో నోట్ల వర్షం కురిసింది.. మొదట ఆశ్చర్యపోయిన జనాలు.. ఒకరినొకరు తోసుకుంటూ ఆ నోట్లు ఏరుకున్నారు. తీరా అవి ఫేక్ నోట్లు అని తేలడంతో అక్కడే పడవేసి వెళ్లిపోయారు. నగరంలో కొంతమంది యువకులు నోట్లను వెదజల్లడం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ లో గుల్జార్‌హౌజ్ ఫౌంటెన్ వద్ద గుర్తు తెలియని యువకులు రోడ్లపై వెదజల్లిన నోట్ల కరెన్సీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకులు రోడ్డు పై ఇరవై రూపాయల నోట్లను వెదజల్లడంతో కొంత మంది వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ తతంగం అంతా తెల్లవారు జామునే అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయ్యింది. అయితే పెళ్లి బారాత్ సందర్భంగా యువకులు ఇలా చేశారని పోలీసులు అంటున్నారు.
నోట్లు వెదజల్లినట్లు తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఎవరూ లేరని చార్మినార్ ఇన్స్ పెక్టర్ నాయుడు తెలిపారు. వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ క్షుణ్ణంగా చెక్ చేస్తున్నామని అన్నారు. అయితే యువకులు వెదజల్లిన నోట్లు అసలైనవా? నకిలీవా అన్న విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సీసీ కెమెరాలో రికార్డు అయిన దానిపై ఎంక్వెయిరీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇది చదవండి: Sukrithi Ambati: పెళ్లి పీటలెక్కనున్న ‘కేరింత’ హీరోయిన్ సుకృతి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్!