ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉగాది పండుగ రోజే తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను కబళించింది. తుర్క పల్లి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఒక దిమ్మెను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంబవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయ పడ్డ వ్యక్తి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చనిపోయిన వారు అంతా నేరేడుచర్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.