తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించి సీఎం కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ దగ్గర ములుగు ఎమ్మెల్యే సీతక్కను నిరసన చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగుల పాల్గొన్నారు. ఇప్పటికే కొత్త జోన్లపై కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుట్రతోనే 317 జీవో తీసుకొచ్చారని ఆరోపించారు.
ఇది చదవండి : హీరో నానికి అల్లు అర్జున్ క్షమాపణలు! కారణం..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 317 జీవోను పునఃసమీక్షించాలని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 317 జీవోను పునఃసమీక్షించాల ఉద్యోగుల తరుపు నుంచి దీక్ష చేస్తున్న సమయంలో బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారతీయ జనతా పార్టీ అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.