ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకు సాగుతుంది. మనిషి సాధించలేనిది ఏదీ లేదని ఎన్నో విధాలుగా నిరూపించాడు. భూమి, ఆకాశం, సంద్రం అన్నింటిపై తన ఆదిపత్యాన్ని సాధిస్తున్నాడు. టెక్నాలజీ పరంగా ఎన్ని విజయాలు సాధించినా ఒక్క విషయంలో మాత్రం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు అన్నా.. దెయ్యం అన్నా భయంతో వణికిపోతుంటారు. ఈ కాలంలో కూడా ఎంతో మంది మూఢ నమ్మకాలతో ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.
అనాగరికమైన చర్యలకు కూడా పాల్పపడుతుంటారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుం కొన్ని చోట్ల భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వరదలకు మనుషులు కొట్టుకొని పోయారు. మరికొన్ని ప్రాంతాల్లో వాన చినుకు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురిపించు దేవుడా అని ప్రార్థనలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కప్పను కట్టిన ఓ కర్రను వారి భుజాలపై పెట్టి, వీధుల్లో తిప్పుతూ మహిళలు భజనలు చేస్తారు… మరికొన్ని చోట్ల వాటికి పెళ్లి కూడా చేస్తారు. ఓ ప్రాంతంలో మాత్రం అలా చేయలేదు.
మూఢనమ్మకాలతో దారుణమైన అకృత్యానికి వడికట్టారు. వర్షాలు కురిపించాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ బాలికలను నగ్నంగా వీధుల్లో తిప్పిన అనాగరిక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలో బజేరా పీఎస్ పరిధిలో… బనియా గ్రామంలో ఘటన జరిగింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వర్షాలు పడాలని సభ్య సమాజం తలదించుకొనేలా వీధుల్లో మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగింపు నిర్వహించడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ మండలి(ఎన్‌సీపీసీఆర్) అప్రమత్తమైంది. దీనిపై దర్యాప్తు ప్రారంభిచండం జరిగిందని, బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.