తెలంగాణలో మైక్రోసాఫ్ట్ సంస్థ మొత్తం రూ.32 వేల కోట్లు పెట్టబుడులు పెట్టనుంది. రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటూ 2022లో ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటికి అదనంగా మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందొకొచ్చింది. దావోస్ లో ఐటీ మినిస్టర్ కేటీఆర్ ని కలిసిన మైక్రోసాఫ్ట్ ఇన్ కార్పొరేటెడ్ ఆసియా విభాగం అధ్యక్షుడు అహ్మద్ మజహరి ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 3 డేటా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు తాము సుముఖంగా ఉన్నామని చెప్పారు. అంటే 2022లో చెప్పిన రూ.16 వేల కోట్లకు అదనంగా మరో రూ.16 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణలో మొత్తం రూ.32 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఇప్పటికీ 3 డేటా కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. ఒక్కే డేటా కేంద్రాన్ని 100 మెగావాట్ల ఐటీ లోడ్ సామర్థ్యం కలిగేలా నిర్మించనున్నారు. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచే సేవలు అందించేలా అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా వచ్చే 15 ఏళ్ల కాలంలో మొత్తం 6 డేటా కేంద్రాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అమెరికా తర్వాత తెలంగాణనే వారికి సౌకర్యవంతమైన రాష్ట్రమని మజహరి వివరించారు.
అందుకే యూఎస్ తర్వాత రెండో కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. ఇంక మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, క్రౌడ్ అభివృద్ధిపై కార్యక్రమాలు వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం కలిసి అవగాహన ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల హైదరాబాద్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సత్య నాదెళ్ల- కేటీఆర్ భేటీ అయ్యారు. అప్పుడు తెలంగాణలో మరిన్ని డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
ఆ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అదనపు డేటా కేంద్రాలు నిర్మిచేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డేటా కేంద్రాల ఏర్పాటు వల్ల హైదరాబాద్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలు అందనున్నాయని.. ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు సైతం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా 6 డేటా కేంద్రాలు ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు.
Great News for #Telangana!@Microsoft announces 3 more Data Centres (DCs) in Hyderabad.
The 6 DCs (3 announced in 2022) enable Microsoft to serve @Azure‘s customers in India & worldwide.
Microsoft conveyed the decision to Minister @KTRTRS in a meeting held at #wef23 @Davos. pic.twitter.com/J0IDjauIC0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) January 19, 2023