తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మెట్రో విస్తరణకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం కీర్తి కిరీటంలో మైట్రో రైలు మణిహారంగా మారింది. నగరంలోని ఎన్నో ప్రధాన ప్రాంతాలను కవర్ చేస్తూ రూపొందించిన మెట్రో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజూ వేలాది మంది ఈ సర్వీసులను వాడుకుంటున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు.. ఇలా అందరూ మెట్రో ట్రైన్స్‌లో ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణంగా పేరు రావడంతో అందరూ మెట్రోల్లో జర్నీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మెట్రో నెట్‌వర్క్‌ను ఇంకా విస్తరించాలనే అభిప్రాయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. సిటీ ఔట్స్కర్ట్స్కు మెట్రో సేవల్ని విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. సిటీలో ఉండే వారు ఎలాగూ ఈ సర్వీసులను విరివిగా వినియోగిస్తున్నారు. వీరితో పాటు హైదరాబాద్‌కు సమీప ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ప్రజలు కూడా నగరానికి రాకపోకలు సాగించేందుకు మెట్రో సేవలపై ఆధారపడుతున్నారు. ప్రయాణ బడలిక తగ్గుతుందనే ఆలోచనతో మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ వాసులకు కేసీఆర్ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రో నెట్‌వర్క్‌ను హయత్ నగర్ వరకు విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
అంతే కాకుండా నాగోల్ మెట్రోను ఎల్బీనగర్‌కు జోడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్‌లో నిర్మించిన రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అన్ని ఫ్లైఓవర్లు పూర్తి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. మరో మూడు ప్లైఓవర్లు ఆఖరి దశలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌లో ఆ మూడు ఫ్లైఓవర్లు పూర్తి చేశాకే.. ఎలక్షన్లకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతా చారి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ చెప్పారు. మరి.. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్‌కు మెట్రో సేవలు విస్తరించనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
LB నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చింతలకుంట నుంచి మాల్ మైసమ్మ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీగా ఫ్లైఓవర్.#LBNagar #FlyOver #ktr #TeluguNews #SumanTV— SumanTV (@SumanTvOfficial) March 25, 2023