తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికల గురించే టాక్ నడుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసన సభ సభ్యత్వం తో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు ఇప్పుడు అన్ని పార్టీల వారికి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్య పోటా పోటీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ప్రచారం చేయాల్సిన బాధ్యత సీనియర్ నాయకులకు ఉందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంటున్నప్పటికీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం తన దారిలో తాను వెళ్తున్నారు. అంతేకాదు పార్టీలకు ప్రాముఖ్యతను ఇవ్వకుండా వ్యక్తిగతంగా తన తమ్ముడికి ఓటు వేయాలని మాట్లాడినట్లు ఆడియో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ కార్యకర్తలతో మునుగోడు ఉప ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మునుగోడులో ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ గెలుస్తుందనన్న నమ్మకం మాత్రం లేదు.. ఒకవేళ ప్రచారానికి పోయినా కొన్ని ఓట్లు మాత్రమే సమీకరించగలను.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.. ఐదు సార్లు ఎమ్మెగా గెలిచాను.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నాను.. నాకు పాతిక సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది.. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయల గురించి నాకు స్పష్టంగా తెలుసు. ఒకవేల అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకోవడానికైనా సిద్దమే’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.