నాయకులు, వారి కుటుంబ సభ్యులు అంటే.. జనాల దగ్గర నుంచి దోచుకోవడం.. తరతరాలు కూర్చుని తిన్న కరగని విధంగా దాచుకోవడం అనే అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే అందరూ ఇలానే ఉండరు. సమాజం గురించి ఆలోచించి.. తమ వంతు సాయం చేసేవారు కూడా ఉంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే.. బొగ్గారపు రుక్మిణమ్మ. ఈమె పాత ఖమ్మం జిల్లాలోని సుజాత నగర్ నియోగజకవర్గానికి చెందిన మొదటి శాసనసభ సభ్యుడు బొగ్గారపు సీతారామయ్య భార్య. ఈ క్రమంలో మానసిక వ్యాధిగ్రస్తులు, అనాథలు, అభాగ్యులకు సేవలందిస్తోన్న అన్నం సేవా ఫౌండేషన్‌కు 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: కూల్‌డ్రింక్‌లో కలుపుకుని.. తరగతి గదిలోనే మద్యం తాగిన విద్యార్థినులు..!
సుజాతనగర్ నియోజకవర్గానికి మొదటి శాసన సభ్యుడిగా ఉన్న బొగ్గారపు సీతారామయ్య భార్య.. బొగ్గారపు రుక్మిణమ్మకు పుట్టింటి వారి పసుపు కుంకుమల కింద ప్రస్తుతం ఆమె నివసిస్తున్న ఇల్లు లభించింది. సీతారామయ్య మరణించిన తర్వాత రుక్మిణమ్మ.. మామిళ్లగూడెంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో మానసిక వ్యాధిగ్రస్తులు, అనాథలు, అభాగ్యులకు సేవలందిస్తున్న అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు రుక్మిణమ్మకు బాగా నచ్చాయి. అందుకే ప్రస్తుతం తాను ఉంటున్న ఇంటిని.. ఆమె మరణానంతరం ఫౌండేషన్‌కు చెందేలా వీలునామా రాసి.. రిజిస్ట్రిషేన్ చేయించారు. దానికి సంబంధించిన దస్తావేజులను ఫౌండేషన్ ఛైర్మన్ అన్నం శ్రీనివాసరావుకు అందజేశారు. ఇక ఈ ఇంటి విలువ సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ ప్రయాణీకులకు మరో షాక్.. పెరిగిన టికెట్ రేట్లు!
ఈ సందర్భంగా రుక్మిణమ్మ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్ర సమరయోధుడైన నా భర్త సీతారామయ్య బతికున్న రోజుల్లో.. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు శాశ్వతంగా జిల్లా ప్రజలకు గుర్తుండాలనే కోరికతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నాను. ఫౌండేషన్ కొనసాగినంత కాలం నా భర్త జ్ఞాపకార్థం అన్నదానం జరుగుతూనే ఉండాలనేది నా ఆకాంక్ష’’ అని తెలిపారు. వచ్చే నెల 7న సీతారామయ్య వర్థంతి నాడు ఆయన కాంస్య విగ్రహాన్ని అదే ఇంటి ముందు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివారసరావు తెలిపారు. ఇక రుక్మిణమ్మ తీసుకున్న నిర్ణయంపై ఖమ్మం ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. రుక్మిణమ్మ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పింఛన్ డబ్బులు తీసుకుని ప్రియురాలితో పరారైన వాలంటీర్!