ఈ మద్య ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్లు కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. ఎదుటి వారి ఆరోగ్యం పాడై.. చనిపోతున్నా తమకు ఎలాంటి సంబంధం లేనట్టుగా కల్తీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసరవస్తువులు అయిన పాలు, టీ పౌడర్, అల్లం, కారం తో పాటు చిన్న పిల్లలు తినే చాక్ లెట్స్, లేసులు సైతం కల్తీ చేస్తున్నారు.
నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్న గోదాం మీద మల్కాజ్ గిరి ఎస్ ఓ టీ పోలీసులు దాడులు నిర్వహించారు. మల్లాపూర్ లోని గ్రీన్ హిల్స్ కాలనీలో గత ఆరు నెలల నుంచి జితేందర్ అనే వ్యక్తి నకిలీ టీ పౌడర్ మిషన్ల ద్వారా తయారు దగ్గరలోని షాపుల్లో విక్రయిస్తు డబ్బు సంపాదిస్తున్నారు.
ఇది చదవండి: ఇండస్ట్రీలో మరో విషాదం! చిన్న వయసులోనే కన్నుమూత!
ఈ వ్యాపారం ఎంతో గుట్టుగా ఎవరికీ తెలియకుండా కొనసాగిస్తున్నా చుట్టు పక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరిలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించి జితేందర్ బస్తాల్లో దాచి ఉంచిన టీ పౌడర్ ని స్వాధినం చేసుకొని నాచారం పోలీస్ స్టేషన్ కి తరలించారు.