బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ.. ఈ రెండింటిలో ఏది ఫేమస్ అంటే.. రెండోదే ఫేమస్. బిర్యానీ.. అన్ని ఊర్లలో ఉంటుంది.. కానీ, హైదరాబాద్ బిర్యానీ ఉందదుగా అంటారు. అంతలా ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, దాదాపు నాలుగైదు విదేశాలకు సైతం.. హైదరాబాద్ బిర్యానీ ప్రతిరోజు పార్సిల్ వెళ్తుంది అంటుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. నగరంలోని ఆర్టీసీ క్రాస్ బిర్యానీ అంటే.. లొట్టలేసుకొని తినే జనాలు కొందరున్నారు. వారికి, ఈ వార్త కాస్త కఠినంగానే ఉందనుకోండి. కానీ చెప్పక తప్పదు. కడుపునిండా బిర్యానీ తిందామనుకున్న వ్యక్తికి అందులో బల్లి ప్రత్యక్షమయింది.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఓ ప్రముఖ రెస్టారంట్ హైదరాబాద్ బిర్యానీకి బాగా ఫేమస్. అందులోని బిర్యానీ అంటే.. జనాలు లొట్టలేసుకొని మరీ తింటారు. అలా తిందామనుకొని.. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆ రెస్టారంట్ లో బిర్యానీ ఇంటికి తెచ్చుకున్నాడు.వెంటనే.. కాళ్ళు చేతులు కడుక్కుని బిర్యానీ తిందాం అని రెడీ అయ్యాడు. బిర్యాని ప్యాకెట్ ఓపెన్ చేసి సగం వరకు తిన్నాడు. ఈ క్రమంలో అతనికి బిర్యానీలో బల్లి కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. బల్లి వున్న బిర్యానీ తాను తిన్నానన్న విషయం గుర్తుకువచ్చి గొంతంతా ఏదో అయిపోయింది. ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ఈ అనుభవానికి ఖంగుతిన్న కార్పొరేటర్ రవిచారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బిర్యానీ పార్శిల్ని స్వాధీనం చేసుకొని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కు పంపించారు.ఈ క్రమంలో.. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు, బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు కొత్తేమి కాదు అనుకోండి. నగరంలో నాసిరకం బిర్యానీలు అమ్ముతున్న బిర్యానీ సెంటర్లు ఎన్నో వున్నాయి. గతంలో పాచిపోయి, నిల్వ వున్న మాంసంతో తయారుచేసిన బిర్యానీలు తిని ఎంతోమంది వినియోగదారులు అస్వస్థతకు గురయ్యారు. ఏదో చేశాం అంటే చేశాం.. అనేలా.. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తనిఖీలు చేస్తే ఇలాంటి చేదు అనుభవాలు వినియోగదారులకు ఎదురవుతూనే వుంటాయి. అందుకే వినియోగదారులు బిర్యానీ తినేముందు ఒకసారి దానిని పరిశీలించడం మంచిది. మరి.. ఆ ప్రముఖ రెస్టారెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Patient: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం: ఆపరేషన్ కోసం తల పైభాగం తొలగింపు. అతికించకుండా దారుణం!