హైదరాబాద్ నగరవాసులుకు గుడ్ న్యూస్.. వీక్ ఎండ్ లో ఆటవిడుపు కోసం సండే ఫండే పేరుతో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆహ్లదకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..
ప్రతిరోజూ ఉదయం లేచిన మొదలు ఉరుకులు పరుగుల జీవితం.. డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో కష్టాలు.. మరెన్నె సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో మనిషి మానసికంగానే కాకుండా.. శారీరకంగా ఎంతో అలసిపోతుంటాడు. అయితే ఈ ఒత్తిడిని అధిగమించడానికి ఆదివారం కుటుంబ సభ్యులతో అహ్లాదంగా గడిపేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. నిత్యం పని ఒత్తిడితో బాధపడేవారు.. వీక్ ఎండ్ లో ఆటవిడుపు కోసం సండే ఫండే పేరుతో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆహ్లదకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఉల్లాసంగా గడిపేందుకు నగరవాసులు ట్యాంక్ బండ్ పై క్యూ కట్టేవారు. కానీ కరోనా కారణంగా కొంతకాలం ‘సండే-ఫన్‌డే’ ఆపివేశారు. హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. ‘సండే-ఫన్‌డే’ తిరిగి ప్రారంభం కాబోతుంది. వివరాల్లోకి వెళితే.
హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. ఆదివారం రోజును ఉల్లాసంగా, ఉత్సాహంగా మార్చుకోవడానికి గతంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సండే ఫన్‌డే కార్యక్రమం మళ్లీ మొదలవుతోంది. ఈ ఆదివారం నుంచే అంటే ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ‘సండే-ఫన్‌డే’ మళ్లీ ప్రారంభం కాబోతుంది. గతంలో ట్యాంక్ బండ్ పై ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాలను పూర్తిగా నిలిపి వేసి ఎన్నో వినోద కార్యక్రమాలు, లేసర్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. చల్లటి గాలికి సేద తీరుతూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసేవారు. ప్రజలను నుంచి విపరీతమైన స్పందన లభించింది.
ఇటీవల హుస్సేన్ సాగర్ సీతరంలో ఫార్ములా ఈ రేస్ పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ కారణంతో సండే-ఫన్‌డే మధ్యలో నిలిపివేశారు. తిరిగి ఇప్పుడు సండే-ఫన్‌డే పునఃప్రారంభిస్తున్నట్లు హెడ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక్కడికి వచ్చేవారికి మరింత ఉత్సాహాన్ని నింపేదుకు ఏకంగా రూ. 17 కోట్ల తో హుస్సేన్ సాగర్‌లో మ్యూజికల్ పౌంటెయిన్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఎప్పుడూ గజిబిజిగా ఉంటూ ఎన్నో టెన్షన్ తో ఉండేవారు ఆదివారం తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు చక్కటి అవకాశం అంటున్నారు అర్వింద్ కుమార్.
ఇక టైమింగ్స్ విషయానికి వస్తే.. ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు 4 షోలు నిర్వహించబోతున్నట్లు అధికారుతు తెలిపారు. ఒక్కో షో 15 నిమిషాల వరకు ఉంటుందని అంటున్నారు. ఆదివారం ఈ వేడుకల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారని సమాచారం. ప్రజలు ఆ సదుపాయాన్ని తప్పకు వినియోగించుకోవాలని అర్వింద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా కోరారు.
It’s #SundayFunday this Sunday ie Feb 19th
Come and enjoy the latest addition – the musical fountains .. pic.twitter.com/64azVn7XnJ
— Arvind Kumar (@arvindkumar_ias) February 17, 2023