నగరం నడిబొడ్డున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లక్డికపూల్ చౌరస్తాలో రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉన్నట్టుండి కారు నుంచి పొగలు రావడం.. అందరూ చూస్తుండగానే మంటలు అంటుకున్నాయి. కారులో ఉన్న వారు వెంటనే అలెర్ట్ అవ్వడంతో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో చుట్టూ పక్కల భారీగా టాఫిక్ జామ్ అయ్యింది. ఘటనకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.