బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వలన హైదరాబాద్ లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఎండలకు అల్లాడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, చాంద్రాయణ గుట్ట, కూకట్ పల్లి, నిజాంపేట్, జీడిమెట్ల.. తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం రావడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద నిలబడి వర్షం తగ్గాక రాకపోకలు సాగించారు.
మరికొన్ని గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో GHMC అప్రమత్తం అయ్యింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగర మేయర్ విజయలక్ష్మి ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, లేదంటే ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అత్యవసరమైన వారు హెల్ప్ లైన్ 040-21111111, 040-29555500 నెంబర్లను సంప్రదించాలి’ అని సూచించారు.
Moderate to heavy sporadic rainfall coupled with gusty winds over the city in the 30 minutes. Citizens are advised to stay indoors unless unavoidable. Dial 040-29555500 for DRF assistance. @KTRTRS @arvindkumar_ias @CommissionrGHMC pic.twitter.com/Crd5osoIfq
— Director EV&DM, GHMC (@Director_EVDM) April 21, 2022