దేశ వ్యాప్తంగా నవీన్ హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక జైల్లో బోరున ఏడ్చందట.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా నవీన్ హత్య కేసు సంచలనంగా మారింది. ప్రియురాలిని దక్కించుకునే ప్రక్రియలో భాగంగా రాక్షసుడిలా మారిన హరిహర కృష్ణ.. తన స్నేహితుడైన నవీన్ ను అబ్దుల్లాపూర్ మెట్ లో అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అతడి శరీర భాగాలను ఒక్కొక్కటిగా వేరు చేసి ఆ తర్వాత ఫొటోలు తీసి తన ప్రియురాలైన నిహారికకు పంపాడు. ఇక అదే రోజు రాత్రి హరిహర కృష్ణ తన స్నేహితుడైన హాసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకున్నాడు.
అనంతరం భయంతో గడిపిన హరిహర కృష్ణ.. తన ప్రియురాలికి అసలు విషయాన్ని చెప్పాడు. చెప్పడమే కాకుండా ఆమెకు హత్య చేసిన ప్రదేశాన్ని చూపించి తిరుగు ప్రయాణంలో ఇద్దరూ ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. ఇదంతా జరిగిన విషయం తెలిసినా కూడా నిహారిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆ తర్వాత హరిహర కృష్ణ ప్రియురాలి వద్ద రూ.1500 తీసుకుని వరంగల్ వెళ్లాడు. ఇక అక్కడికి వెళ్లిన రెండు మూడు రోజులకు అతడు హైదరాబాద్ వచ్చి నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
ఈ ఘటనలో నిందితుడు హరిహర కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి అసలు నిజాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్నారు. ఇకపోతే పోలీసులు ఇటీవల హరిహర కృష్ణను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసమని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఎలా హత్య చేశాడు, ఎలా చేశాడనే సమచారాన్ని రాబట్టారు. ఇందులో భాగంగానే నిందితుడు అతని ప్రియురాలు, స్నేహితుడు తనకు సహకరించారని చెప్పడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిహారిక, హాసన్ ను పోలీసులు విచారించి హయత్ నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.
దీంతో పోలీసులు నిందితులను ఏ2గా నిహారిక, ఏ3గా హాసన్ ను చేర్చారు. అనంతరం పోలీసులు నిహారికను చంచల్ గూడ జైలుకు తరలించగా, హాసన్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడి వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. మేము చేసింది తప్పని నిందితులు తెలుసుకుని ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం.. చంచల్ గూడ జైలులో ఉన్న నిహారిక తన తప్పును తెలుసుకుని బోరు ఏడ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని నిందితురాలు నిహారిక పశ్చాత్తాపం పడుతున్నట్లుగా తెలుస్తుంది.