అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హరిహర అతి కిరాతకంగా నవీన్ హత్య చేసి అతని శరీర భాగాలను వేరు చేశాడు. తర్వాత వాటిని హత్య చేసిన ప్రాంతంలో తగలబెట్టాడు. ఈ కేసులో హరిహర ప్రియురాలు, ఫ్రెండ్ ని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు.
అబ్దుల్లాపూర్ మెట్ లో బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. హరిహర కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయి కోసం నవీన్ ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతని శరీర భాగాలను వేరు చేసి సంచిలో వేసుకుని తీసుకెళ్లి వేరే ప్రాంతంలో పారేశాడు. తన మిత్రుడు హసన్- నిహారికలతో కలిసి నవీన్ మృతదేహాన్ని చూసి వచ్చారు. తర్వాత రెండ్రోజులు హరిహర వేరే ఊర్లలో తిరుగుతూ ఉన్నాడు. నవీన్ తండ్రి హరిహరకు ఫోన్ చేయడంతో హత్య విషయం బయటకు వస్తుందేమో అని నవీన్ అవయవాలను తిరిగి హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టారు. ఆధారాలు దొరక్కుండా చేయాలని చూశాడు.
హసన్- యువతి కూడా హత్య చేసిన విషయం తెలిసి.. హరిహరతో ఫోన్ లో కాంటాక్ట్ లోనే ఉంటూ పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం అందించలేదు. పైగా ఆధారాలను ఫ్యాబ్రికేట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ విషయంలో పోలీసులు హసన్ ను ఏ2గా, నిహారికను ఏ3గా కేసులో చేర్చి విచారణ చేస్తున్నారు. హరిహర కృష్ణ అస్సలు దొరకను అనే ధైర్యంతోనే ఈ హత్య చేసినట్లు చెప్పారు. అతను హత్య చేస్తాడని వీళ్లకి తెలియకపోయినా కూడా చేశాడని తెలిసి కూడా పోలీసులకు చెప్పకపోవడంపై కేసు నమోదు చేశారు. నవీన్ హత్య చేయడంపై అతని తండ్రి స్పందించారు.
“నా కొడుకు శరీరం దొరకకూడదని తల, వేళ్లు, గుండె వంటివి బ్యాగులే వేసుకుని వేరే చోటుకు తీసుకెళ్లారు. చెత్తకుండీలో పారేసిన తర్వాత మళ్లీ ఆ పార్ట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి తగలబెట్టారు. నా కొడుకు బాడీ పార్ట్స్ కాల్చి.. వాళ్లు రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ తింటూ ఎంజాయ్ చేశారు. హరిహర కృష్ణ, నిహారిక, హసన్ ముగ్గురికీ ఉరిశిక్ష వేయాలి. వాళ్లని తొందరగా ఉరితీయాలి. వాళ్లని త్వరగా ఉరితీయక పోతే.. పోలీసుల వద్దకు వచ్చి మేము ముగ్గురం అక్కడ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం. మా పరిస్థితి కూడా ఎలాగూ బతికేలా లేదు” అంటూ నవీన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా వారికి ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు.