ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక ప్రేమికురాలు, ఇద్దరు ప్రేమికులు మధ్య ఆరంభమయిన ఈ స్టోరీ.. ఆర్య-2 సినిమాను మించిపోయేలా ఉండగా.. క్లైమాక్స్ మాత్రం క్రైం స్టోరీలనే తలదన్నేలా ఉంది. ఈ పాశవిక ఘటనపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వివాదాల వర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. ఎప్పటిలానే తనదైన శైలిలో స్పందించిన వర్మ, ప్రేమను ఎందుకు గుడ్దిదంటారో పూసగుచ్చినట్లు వివరించారు.
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హరిహర అతి కిరాతకంగా నవీన్ హత్య చేసి అతని శరీర భాగాలను వేరు చేశాడు. తర్వాత వాటిని హత్య చేసిన ప్రాంతంలో తగలబెట్టాడు. ఈ కేసులో హరిహర ప్రియురాలు, ఫ్రెండ్ ని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు.
దేశ వ్యాప్తంగా నవీన్ హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న హరిహర కృష్ణ ప్రియురాలు నిహారిక జైల్లో బోరున ఏడ్చందట.