ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక ప్రేమికురాలు, ఇద్దరు ప్రేమికులు మధ్య ఆరంభమయిన ఈ స్టోరీ.. ఆర్య-2 సినిమాను మించిపోయేలా ఉండగా.. క్లైమాక్స్ మాత్రం క్రైం స్టోరీలనే తలదన్నేలా ఉంది. ఈ పాశవిక ఘటనపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వివాదాల వర్మ ఎట్టకేలకు మౌనం వీడారు. ఎప్పటిలానే తనదైన శైలిలో స్పందించిన వర్మ, ప్రేమను ఎందుకు గుడ్దిదంటారో పూసగుచ్చినట్లు వివరించారు.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్ధి నవీన్ హత్య కేసు అందరికీ విధితమే. తన ప్రేయసికి దగ్గరవుతున్నాడనే కారణంతో నవీన్ అనే విద్యార్థిని అతని స్నేహితుడే హతమార్చాడు. ఆపై నవీన్ శరీరాన్ని ఛిద్రం చేసి.. గుండె, పేగులు బయటికి లాగి, మర్మాంగం కోసి.. అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. థ్రిల్లర్ మూవీని తలపించే ఈ ఘటన ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. ఈ పాశవిక ఘటనపై సెన్సేషనల్ డైరెక్టర్, వివాదాల వర్మ(RGV) తనదైన శైలిలో స్పందించారు.
విషయం ఏదైనా వర్మ స్పందించారు అంటే.. అది ప్రజలకు వార్తే. ఇటీవల వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి పక్షాన నిలబడ్డ వర్మ ప్రభుత్వంపై, మేయర్ పై ఎంతలా పోరాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలుడి కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే, నవీన్ హత్య కేసుపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన ఎట్టకేలకు నోరు తెరవడం గమనార్హం. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ ట్వీట్ పోస్ట్ పోస్ట్ చేశారు. వర్మ.
ఈ ఘటనకు కారణమైన ముగ్గురు ప్రేమికుల ఫోటోలను పంచుకున్న ఆర్జీవీ.. “అమ్మాయి కోసం ఒక అబ్బాయి.. తన స్నేహితుడినే అతి కిరాతకంగా చంపాడని వివరించాడు. ఆపై చివరలో “ప్రేమ గుడ్డిదని తెలుసు.. కానీ మరీ ఇంత గుడ్డిదని మాత్రం నాకు తెలియదు..” అంటూ వెటకారపు టచ్ ఇచ్చాడు. ఈ ట్వీట్ నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ ట్రైయాంగిల్ క్రైం లవ్ స్టోరీని సినిమా తీయాలంటూ నెటిజన్స్ ఆర్జీవీకి సూచిస్తున్నారు. అంతే కాదు.. ‘ఆర్య-3’, ‘గుడ్డి ప్రేమ’ అంటూ సినిమా టైటిల్స్ సజెస్ట్ చేస్తున్నారు. చూడాలి.. మరీ వర్మ గారు సినిమా ప్లాన్ చేస్తారా..! లేదా! అన్నది. వర్మ సెటైరికల్ ట్వీట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The guy on the left top killed the guy on left bottom for the girl on the right ..I knew that love is blind but I dint know it was this BLIND 😳😳😳 pic.twitter.com/CONDhZcesY
— Ram Gopal Varma (@RGVzoomin) March 12, 2023