ఓ కసాయి భర్త.. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఈ దుర్మార్గుడు మరో ఊహించని దారుణం కూడా చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?
తెలంగాణలో వరుస దారుణ ఘటనలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. ప్రియురాలు మోసం చేసిందని, భార్య పరాయి వాడిపై మనుసుపడిందనే కారణాలతో కొందరు వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేస్తున్నారు. అయితే తాజాగా ఓ కసాయి భర్త.. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా ఈ దుర్మార్గుడు మరో ఊహించని దారుణం కూడా చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?
అది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని అజాజ్ నగర్ ప్రాంతం. ఇక్కడే ధన్ రాజ్-లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే గడిపారు. ఇదిలా ఉంటే గత రెండు నెలల కిందట ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. దీంతో అప్పటి నుంచి పుట్టింటి వాళ్ల దగ్గరే ఉన్న లావణ్యను భర్త ధన్ రాజ్ బుధవారం తన ఇంటికి నిద్ర చేయడానికి తీసుకొచ్చాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ధన్ రాజ్ భార్యతో గొడవ పడ్డాడు.
దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త.. భార్యను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా రెండు నెలల కొడుకును సైతం నీటి సంపులో పడేసి హత్య చేశాడు. భార్య, కొడుకు చనిపోయారని తెలుసుకున్న నిందితుడు ధన్ రాజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ, చిన్నారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న లావణ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షణికావేశంలో భార్యను, 2 నెలల కుమారుడిని హత్య చేసిన ఈ దుర్మార్గుడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.