తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలు పాలైన వారు కొందరుంటే.. మరికొంతమంది చనిపోతున్నారు. ఒంటరిగా చిన్న పిల్లలు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నా.. ఆడుకుంటున్నా వారిపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజూ ఎక్కడో అక్కడ వీధికుక్కలు చిన్నా, పెద్దా అనే తేడాల లేకుండా మనుషులపై స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు వీధి కుక్కల దాడుల్లో తీవ్ర గాయాల పాలు కావడమే కాదు.. చనిపోయిన సంఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అంబర్ పేట్ లో నాలుగేళ్ల ప్రదీప్ అనే బాలుడున్ని వీధి కుక్కలు దారుణంగా దాడి చేసి చంపాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఇలాంటి ఘటనలు జరిగినపుడు మాత్రమే ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది.. తర్వాత షరా మామూలే.. అంబర్ పేట్ ఘటన తర్వాత రాష్ట్రంలో ఎన్నో ఘటనలు జరిగాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి.. తీవ్రంతో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే..
రాష్ట్రాంలో ప్రతిరోజూ వీధి కుక్కలు ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు ఎగబడి కరుస్తున్నాయి. ఆ సమయంలో పెద్దవాళ్లు వెళ్లి రక్షిస్తున్నారు. వాహనాలపై వెళ్తున్నవారిపై కూడా కుక్కలు దాడులు చేయడం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో కొంతమంది భయంతో కిందపడి గాయాలుపాలవుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటి పరిధిలో ఆలీ సాజ్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆలీ సాజ్ ఏడేళ్ల కూతురు ఇంటి నుంచి షాపు కి నడుచుకుంటూ వెళ్తుంది. అంతలోనే రెండు కుక్కలు వచ్చి బాలికపై దాడి చేసి కరిచాయి. బాలిక కేకలు వేయడంతో తండ్రి వచ్చాడు.. దీంతో అక్కడ నుంచి కుక్కలు వెళ్లిపోయాయి.
వీధి కుక్కల దాడిలో బాలిక తలకు, చేతికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో తల్లిదండ్రులు నర్సాపూర్ లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు అనంతపురం టౌన్‌లో డిగ్రీ విద్యార్థిని చేతనపై వీధికుక్క దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమె చేతిపై తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోకూడా వీధి కుక్కల దాడులకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలికపై వీధి కుక్కల దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.