తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పర్చడానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకనం కట్టుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన ఆయన ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయ యాత్ర సందర్భంగా అశేష జనం ఆయన్ని కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మంగళవారం ఆయన కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత ఓ ప్రత్యేక అతిథిని కలిశారు. ఇంతకీ ఎవరా ప్రత్యేక అతిథి అనుకుంటున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో అందరి మనసు దోచిన బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ లో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొండగట్టు అంజన్న దర్శనం చేసుకొని క్యాంప్ ఆఫీస్ లో కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసేందుకు గంగవ్వ వెళ్లింది. గంగవ్వను చూడగానే రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకొని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. కొద్ది సేపు రేవంత్ రెడ్డితో ముచ్చటించిన గంగవ్వ ఎండలో పడి వచ్చావ్.. నీ కోసం బాక్స్ తీసుకు వచ్చినా అని అందులో ఉన్న బజ్జీలు రేవంత్ రెడ్డికి పక్కనే ఉన్న పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్కకు ఇచ్చింది. బజ్జీలు తింటున్న రేవంత్ రెడ్డితో ఈ బజ్జీలు ఎట్ల ఉన్నయ్.. నీ భార్య చేసినట్టు ఉన్నయా.. ముసల్ది చేసినట్లు ఉన్నయా అని అడిగింది. దాంతో రేవంత్ రెడ్డి నవ్వుతూ.. మా అవ్వ చేసినట్టు ఉంది అన్నాడు. టెన్షన్ ఏమీ పెట్టుకోకు.. నిమ్మలంగా ఉండు అంటూ గంగవ్వ.. రేవంత్ రెడ్డితో చెప్పింది. ఈ సందర్భంగా పాదయాత్ర విశేషాలు గంగవ్వతో ముచ్చటించారు రేవంత్ రెడ్డి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో గంగవ గురించి తెలియని వారు ఉండరు. ఎక్కడో మారు మూలన వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ ఉన్న గంగవ్వ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక సెలబ్రెటీగా మారిపోయింది. తెలంగాణ యాసతో గంగవ్వ యూట్యూబ్ ఛానల్స్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఇక తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కూడా తన సత్తా చాటింది. ఇటీవల సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీతో పాటు ఆ మద్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీలో కూడా కనిపించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని గంగవ్వ కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గంగవ్వ! తెలంగాణకు పరిచయం అక్కరలేని అవ్వ… ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నా కోసం ఆప్యాయంగా… నాకిష్టమైన మిర్చీ బజ్జీ తెచ్చి… తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది.
“యాత్ర”లో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా… నా అనుభవాలను నా… https://t.co/RhGWi0YnDv pic.twitter.com/xyxokggNqz— Revanth Reddy (@revanth_anumula) March 7, 2023