నిత్యం వందలాది మంది రోగులతో కిక్కిరిసి ఉండే ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఎంతటి భయంకర పరిస్థితులు తలెత్తుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోగులు, వారి కోసం వచ్చినవారు, ఆస్పత్రి సిబ్బంది ప్రాణభయంతో బిక్కచచ్చిపోతారు. ఇదే సంఘటన హైదరాబాద్ బేగంపేట మెడికవర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి ఆరో అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.