మనం సాధారణంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి రెస్టారెంట్లకి వెళ్తాం. అక్కడ తిన్నే తిండి కంటే ఇతర వస్తువుల రేట్లు అధికంగా ఉంటాయి. కొన్ని హోటళ్లు అయితే MRP ధర కంటే అదనంగా వసూలు చేస్తాయి. చాలా మంది వినియోగదారులు ఇలాంటివి చూసి చూడనట్లు వదిలేస్తారు. కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం హోటల్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. బిల్లుపై ఐదు రూపాయాలు అదనంగా వసూలు చేసిన హోటల్ కి రూ.55 వేలు వదిలించాడు.
వివరాల్లోకి వెళ్తే..ఉస్మానియా యూనివర్సిటీ(OU)లో చదువుకుంటున్న చిలుకూరి వంశీ.. తన నలుగురు స్నేహితులతో కలిసి తిలక్ నగర్ లోని లక్కీ బిర్యానీ హోటల్ కి వెళ్లి బిర్యానీ తిన్నారు. అనంతంరం జీఎస్టీతో కలుపుకుని మొత్తం రూ.1,127 బిల్లు అయింది. కానీ హోటల్ సిబ్బంది మినరల్ వాటర్ బాటిల్ పై ఎంఆర్పీ ధర కంటే రూ.5.50 అదనంగా వసూలు చేసినట్లు వంశీ గుర్తించాడు. అదనంగా ఎందుకు వసూలు చేశారని హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా వంశీపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా తన స్నేహితుల ముందు అవమానించడంతో మనస్సు కలత చెందాడు వంశీ. ఎలాగైనా వారికి బుద్ధి చెప్పాలని భావించాడు. వెంటనే ఈ ఘటనపై వినియోగాదారుల ఫోరమ్ లో ఫిర్యాదు చేశాడు. వంశీ హోటల్ బిల్లుకు సంబంధించి కాగితాలను సమర్పించాడు.
విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్-2 బెంచ్ తీర్పు వెలువరించింది. ఫిర్యాదుదారుడి పట్ల హోటల్ సిబ్బంది దరుసుగా, పరుష పదజాలంతో దూషించడంతో పాటు సదరు హోటల్ సేవల్లో జరిగిన లోపాలను నిజమే అని రుజువైంది. వినియోగదారుడి నుంచి అదనంగా వసూలు చేసిన ఐదు రూపాయాల కి 10శాతం వడ్డీతో అతనికి రూ.5 వేల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది. దీనితో పాటు నెలన్నర రోజుల్లో రూ.50 వేలు జరిమానా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో చెల్లించాలని సదరు హోటల్ యాజమాన్యన్ని ఆదేశించింది. రూ.5.50 అదనంగా వసూలు చేసిన సదరు హోటల్ కి రూ.55 వేలు జరిమాన శిక్షగా వేయండ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.