మాతృత్వం చాటుకోవడానికి పేగు తెంచుకుని జన్మే ఇవ్వల్సిన అవసరం లేదు. అమ్మా అని పిలిస్తే చాలు.. కడుపున పుట్టకపోయినా కళ్లలో పెట్టుకుని చూసుకునేంత గొప్ప మనసు అమ్మది. అందుకే అన్ని బంధాల్లోకెల్లా గొప్ప బంధం తల్లితో బిడ్డకు పెనవేసుకున్న బంధం. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని ఎలా పంచాలో తెలిస్తే చాలు. మనుషుల్లో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉంటాయి కానీ.. జంతువుల మధ్య అలాంటి భేదాభిప్రాయలు ఉండవని.. మాతృదినోత్సవానికి ఒక రోజు ముందే ఆ బంధం గొప్పతనం నిరూపించిందో శునకం. జాతి భేదం మరచి అమ్మతనం చాటింది. ఆకలితో ఉన్న గొర్రె పిల్లలకు పాలిచ్చి తల్లి లాలన పంచింది.
సాధారణంగా మేకల, గొర్రెల మందపై వీధి కుక్కలు తరచూ దాడులు చేసి ప్రాణాలు తీస్తుంటాయి. మనకు తెలిసినంత వరకు మేకలు, గొర్రెలపై కుక్కలు దాడులు చేయడం వాటిని గాయపర్చడం తెలిసిన విషయమే.. కానీ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతాన్‌శెట్టిపల్లి గ్రామంలో కనిపించే దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒక గొర్రె పిల్లకు శునకం ప్రతిరోజూ పాలు ఇస్తూ దాని సొంత బిడ్డలా చూసుకుంటుంది. వివరాల్లోకి వెళితే..
మెదక్ కి చెందిన రవీందర్ అనే వ్యక్తి ఇటీవల ఒక గొర్రె పిల్లను కొన్నాడు. దానికి తల్లి లేకపోవడంతో తానే పాలుపడుతూ వస్తున్నాడు. అనుకోకుండా ఒక అర్జెంట్ పని పడలంతో సాయంత్రం రవీందర్ బయటకు వెళ్లాడు. రావడానికి ఆలస్యం కావడంతో ఆకలితో అలమటించి పోయింది గొర్రెపిల్ల. అక్కడికి వచ్చిన ఓ శునకాన్ని చూసి దాని వద్దకు వెళ్లి పాలు తాగింది. వేరే జాతి పిల్ల తన వద్దకు వచ్చిందని ఏమాత్రం ఆలోచించలేదు ఆ శునకం.
తన పిల్లలకు పాలు ఇస్తూ కనిపించిన శునకాన్ని చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిగెత్తుకుంటూ ఆ శునకం దగ్గరకు వెళ్లింది. వేరే జాతి పిల్ల తన వద్దకు వచ్చిందని ఏమాత్రం ఆలోచించలేదు ఆ శునకం. ఆకలి తీర్చే అమ్మను నేనవుతానంటూ ముందుకొచ్చింది. కాలు తాగుతున్నంత సేపు ఏమీ అనలేదు.
అప్పుడే ఇంటికి వచ్చిన రవీందర్‌కు ఆ దృశ్యం కంటపడింది. ఆ తల్లిప్రేమకు కళ్లు చెమర్చి.. ఆ అద్భుత దృశ్యాన్ని తన సెల్ ఫోన్ లో బంధించాడు. మాతృదినోత్సవానికి ఒక రోజు ముందే జాతి భేదం మరచి మాతృత్వం చాటుకున్న ఈ అద్భుత ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Anchor Suma: యాంకర్ సుమకి ప్రమాదం! వైరల్ అవుతున్న వీడియో!