మాతృత్వం చాటుకోవడానికి పేగు తెంచుకుని జన్మే ఇవ్వల్సిన అవసరం లేదు. అమ్మా అని పిలిస్తే చాలు.. కడుపున పుట్టకపోయినా కళ్లలో పెట్టుకుని చూసుకునేంత గొప్ప మనసు అమ్మది. అందుకే అన్ని బంధాల్లోకెల్లా గొప్ప బంధం తల్లితో బిడ్డకు పెనవేసుకున్న బంధం. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని ఎలా పంచాలో తెలిస్తే చాలు. మనుషుల్లో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉంటాయి కానీ.. జంతువుల మధ్య అలాంటి భేదాభిప్రాయలు ఉండవని.. మాతృదినోత్సవానికి ఒక రోజు ముందే ఆ బంధం గొప్పతనం నిరూపించిందో శునకం. […]