తెలంగాణ రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మించారు.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలకమైన ఫైల్స్ పై తొలి సంతకం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సుమూహూర్తంలో పలు ముఖ్యమైన ఫైల్స్ పై సంతకాలు చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేల ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పి వారి గుండెల్లో సంతోషాన్ని నింపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పది ప్రభుత్వ శాఖల్లో 40 విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5544 పోస్టులను రెగ్యూలరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ తన తొలి సంతకం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోలు కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేసిందుకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్పతనం సీఎం కేసీఆర్ కి ఉందని.. తెలంగాణ అభివృద్ది కోసం ఆయన అహర్శశలు కష్టపడుతున్నారని.. ట్విట్టర్ వేధికగా హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పది జిల్లాల్లోని గర్ణిణిలకు మాత్రమే కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్లు అందించారని.. ఇక నుంచి అన్ని జిల్లాలకు అందించేందుకు నిర్ణయం తీసుకన్నారని తెలిపారు. ఒక్కో కిట్ రూ.2 వేల చొప్పున మొత్తం రూ.277 కోట్లు వెచ్చించినట్లు ప్రకటించారు.
నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు.
— Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2023