ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో BRS మీటింగ్ లో కవితను రేపు అరెస్ట్ చేయెుచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్.. రోజుకో మలుపు తీరుగుతోంది. ఇక ఈ స్కామ్ లో తెలంగాణ నుంచి ప్రధానంగా వినిపిస్తోన్న పేరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కవితను విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. మార్చి 9న విచారణకు హాజరు కావాలంటూ కోరారు. అయితే హాజరవ్వడం కుదరదని కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు(మార్చి10)న జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపట్టింది ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలోనే BRS మీటింగ్ లో కవితను రేపు అరెస్ట్ చేయెుచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే మార్చి 9న ఈడీ విచారణకు హాజరు కావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం చట్టబద్దమైన వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటుందని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసింది కవిత. ఈడీ నోటీసుల నేపథ్యంలో తాజాగా స్పందించారు సీఎం కేసీఆర్. శుక్రవారం జరిగిన BRS మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..”రేపు కవితను అరెస్ట్ చేయెుచ్చ. మెున్న గంగుల, నిన్న రవిచంద్ర, నేడు కవిత వరకు వచ్చారు. ఎంత మంచిగా పనిచేసినా గానీ మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. ప్రజల కోసం కడుపుకట్టుకుని పనిచేస్తున్నాం. కవితను అరెస్ట్ చేస్తే.. చేసుకోని, మేం ఎవరికీ భయపడం” అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక బీజేపీకి భయపడేదే లేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్. ఇక రేపు ఉదయం 10 గంటల తర్వాత కవిత ఈడీ ఆఫీస్ కు హాజరుకానున్నారు. ఆమెతో పాటుగా రామచంద్ర పిళ్లైను కలిసి విచారించనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలువురు నాయకులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. అందరు జాగ్రత్తగా పని చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. మరి కవితను రేపు అరెస్ట్ చేయెుచ్చు అని సాక్షాత్తు కేసీఆర్ అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.