ఎప్పుడూ సౌమ్యంగా ఉండే బాబు మోహన్ తనలోని యాంగ్రీ యాంగిల్ ని బయటపెట్టారు. బీజేపీ కార్యకర్తపై బూతులతో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్.. ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ అనే బీజీపీ కార్యకర్తపై బాబు మోహన్ నోరు పారేసుకున్నారు. స్థాయి గురించి మాట్లాడుతూ కార్యకర్తను అవమానించారు. అంతకు ముందు ఏం జరిగిందో అనేది తెలియదు గానీ.. బాబు మోహన్ కి కాల్ చేసిన కార్యకర్త ఆయనతో కలిసి పని చేద్దామని అనుకున్నారు. ఇదే విషయాన్ని బాబు మోహన్ దగ్గర ప్రస్తావించారు. ‘మీతో కలిసి పని చేద్దామనుకుంటున్నా సార్’ అని కార్యకర్త బాబు మోహన్ తో అంటే.. ఆయన కార్యకర్తను దూషించారు.
కార్యకర్త బాబు మోహన్ కి కాల్ చేశారు. కాల్ లిఫ్ట్ చేసిన బాబు మోహన్.. ‘తమ్ముడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లమ్’ అంతో కార్యకర్తను బూతులతో దూషించారు. ఫోన్ చేస్తే మాట్లాడాలి కదా, బాబు మోహన్ ఫోన్ చేస్తే మాట్లాడవా? నీ వయసెంత? నీ లైఫ్ ఎంత? జోగిపేటకు నువ్వేం చేయగలవు? ఎన్ని ఓట్లు ఉన్నాయిరా నీకు? ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వెంతరా? ఏ స్థాయి అయినా నువ్వు..’ అంటూ బూతులు తిట్టారు. ‘ఫోన్ పెట్టేయ్ ఫస్ట్. ఇంకెప్పుడూ ఫోన్ చేయకు. నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకుని కొడతాను’ అని అన్నారు. కాల్ రికార్డ్ చేసుకుంటే చేసుకోరా అంటూ రెచ్చిపోయారు. కాగా కార్యకర్తకు మీరిచ్చే విలువ ఇదేనా సార్ అంటూ కార్యకర్త తన బాధను చెప్పుకున్నారు. అయినా గానీ బాబు మోహన్ ఏమాత్రం మర్యాద లేకుండా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన ఆడియో కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.