’అన్న పవన్ అన్నకీ నీ అపార్దాలతో దూరంగా వుండకు... ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి కొంచెం రిలీఫ్ నీలాంటి వాళ్ళు.. సమయం దొరికినప్పుడు కలువు.. ఆయన్నీ అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు..మీరు అలా కావద్దు‘ అన్న నెటిజన్ కు తన స్టైల్లో సమాధానం ఇచ్చారు నిర్మాత బండ్ల గణేష్. అదేవిధంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడూ సౌమ్యంగా ఉండే బాబు మోహన్ తనలోని యాంగ్రీ యాంగిల్ ని బయటపెట్టారు. బీజేపీ కార్యకర్తపై బూతులతో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్.. ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ అనే బీజీపీ కార్యకర్తపై బాబు మోహన్ నోరు పారేసుకున్నారు. స్థాయి గురించి మాట్లాడుతూ కార్యకర్తను అవమానించారు. అంతకు ముందు ఏం జరిగిందో అనేది తెలియదు గానీ.. బాబు మోహన్ కి కాల్ చేసిన కార్యకర్త ఆయనతో కలిసి పని చేద్దామని అనుకున్నారు. ఇదే […]
ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకే పరిమితం అయ్యింది. తెలంగాణలో ఏదో నామమాత్రంగా వ్యవహరించేది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాలు కారణంగా ఇప్పుడు తెలంగాణాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో బలపడాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్న టీడీపీ.. అందుకోసం సమర్థులను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులుని తప్పించి.. ఆ స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ కి […]
టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేసీఆర్ ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ నేడు (డిసెంబర్ 9న) బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1.20 నిమిషాలకు కేసీఆర్ సంతకంతో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ శుభ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ సంబరాల్లో నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే […]
టీపీసీసీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీజీ అనే పదాన్ని కనుమరుగు చేసి టీఆర్ఎస్ పార్టీ పదాలను అనుకూలించేలా టీఎస్ అనే పదాన్ని తీసుకొచ్చారని కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్ ని టీజీగా మారుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఎస్ కి బదులు టీజీ అనే రాసుకోవాలని సూచించారు. కేసీఆర్ తెలంగాణ చరిత్రను వక్రీకరించి టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకున్నారు […]
రాజకీయాలలో ఆరోపణలు.. ప్రత్యారోపణలు సహజమే. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ఆరోపణలు తీవ్ర పరిణాలమాలకు దారి తీస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిణామాలే తెలంగాణలో కనిపిస్తోన్నాయి. తాజాగా మునుగోడు సభకు హాజరైన కేంద్ర హూం మంత్రి అమిత్ షా చెప్పులు మోసినట్లు తనపై వస్తోన్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం జనగామ జిల్లా మీదికొండ నుంచి […]
ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రైతులకు ఒక మంచి శుభవార్త చెప్పారు. యాసంగిలో పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయబోతున్నట్లుగా ఆయన రైతులకు తెలిపారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులు కష్టాలు పడుతున్నారు.. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందన్న విషయం నిపుణులతో […]
Telangana Politics : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు లేరని అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు మంత్రి కేటీఆర్. ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి ప్రత్యర్థి పార్టీ వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కేటీఆర్ కలిశారు. ‘అన్నా.. బాగున్నావా? అంటూ ఆప్యాయంగా పలికరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అంతేకాదు! బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్‌లను కూడా […]
సీఎం కేసీఆర్ నారాయణ ఖేడ్ పర్యటనలో భాగంగా జరిగిన సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను సీఎం తన ప్రక్కన సీటులో కూర్చోబెట్టుకున్నారు. సభలో మంత్రి హారీష్ రావు ఆ మహిళ గురించి ప్రస్తావించగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ వేదికపైకి పిలిపించారు. తన ప్రక్క సీట్లో కూర్చోపెట్టుకున్న సీఎం ఆ మహిళ చెప్పే విషయాలు విన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ మారింది. దీంతో అందరిలో ఆ మహిళ ఎవరు? అనే ఆసక్తి […]
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ సారి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు ఎదురు లేదు. ఇక జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా మారాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే కేసీఆర్ గత రెండేళ్లుగా తన ప్రయత్నాలను పట్టాలెక్కించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి […]